SRH vs MI | టాస్ గెలిచిన ముంబై..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 లో భాగంగా నేడు మరో కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సొంత మైదానంలో ఆరెంజ్ ఆర్మీ తొలుత బ్యాటింగ్ చేప‌ట్ట‌నుంది.

జట్టు మార్పులు:

సన్‌రైజర్స్ హైదరాబాద్: తుది జట్టులోకి మహమ్మద్ షమీ స్థానంలో జయదేవ్ ఉనద్కత్.
ముంబై ఇండియన్స్: అశ్వని కుమార్ స్థానంలో విఘ్నేష్ పుత్తూర్ తుది జట్టులోకి వ‌చ్చాడు.

తుది జ‌ట్లు

ముంబై ఇండియన్స్ : ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీప‌ర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, విఘ్నేష్ పుత్తూర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.

సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీప‌ర్), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఈషాన్ మలింగ, జీషన్ అన్సారీ.

ఇంపాక్ట్ ప్లేయర్స్

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, రాబిన్ మింజ్, రాజ్ అంగద్ బావా, కార్బిన్ బాష్, సత్యనారాయణ రాజు.
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, వియాన్ ముల్డర్, మహమ్మద్ షమీ, రాహుల్ చాహర్.

ఉగ్ర‌దాడి బాధితుల‌కు నివాళిగా..

ప‌హ‌ల్గ‌మ్ ఉగ్ర‌దాడి బాధితుల‌కు సంతాపంగా నేటి మ్యాచ్‌లో రెండు జట్ల ఆటగాళ్లు , అంపైర్లు భుజాలపై నల్ల రిబ్బన్లు ధరించనున్నారు. అలాగే ఈ మ్యాచ్‌లో బాణసంచా కాల్చడం, చీర్‌లీడర్ డ్యాన్స్ ఉండదని బీసీసీఐ తెలిపింది. మృతులకు నివాళులర్పించడానికి మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక నిమిషం మౌనం కూడా పాటించనున్నారు.

టాప్ 3 టార్గెట్ !

ఈ సీజ‌న్ ను ఓట‌ముల‌తో ప్రారంభించిన ముంబై… హ్యాట్రిక్ విజయాలతో ప్లే-ఆఫ్ రేసులోకి దూసుకొచ్చింది. ఇప్ప‌టికే 8 పాయింట్ల‌తో 6వ స్థానంలో ఉన్న ముంబై మ‌రో విజ‌యం సాధిస్తే 10 పాయింట్ల‌తో టాప్ 3లోకి చేరుకుంటుంది. దీంతో వాంఖడేలో హైదరాబాద్‌ను చిత్తు చేసిన హార్దిక్ జట్టు… మరోసారి అదే పునరావృతం చేసి పాయింట్ల పట్టికలో పైకి దూసుకుపోవాల‌ని చూస్తోంది.

ప్రతీకారమే ప్లాన్..

మరోవైపు, సన్‌రైజర్స్ వైల్డ్‌ఫైర్ ఆట తొలి మ్యాచ్‌కే పరిమితమైంది. ఆడిన 7 మ్యాచుల్లో 5 ఓట‌ముల‌తో 9వ స్థానంలో నిలిచిన హైద‌రాబ‌ద్ ప్లే-ఆఫ్ రేసులో వెనుకబడింది. అయితే, వాంఖడేలో ముంబై చేతిలో దెబ్బ‌తిన్న ఆరెంజ్ ఆర్మీ.. ఈసారి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతోంది.

ముఖాముఖి పోరులో..

కాగా, ఇప్ప‌టివ‌ర‌కూ ఇరుజ‌ట్లు 24 సార్లు త‌ల‌ప‌డ‌గా.. ముంబై జ‌ట్టు అత్య‌ధికంగా 14 ప‌ర్యాయాలు గెలుపొంద‌గా.. స‌న్‌రైజ‌ర్స్ 10 విజ‌యాలు సాధించింది. ఉప్ప‌ల్ స్టేడియం బ్యాటింగ్‌కు స్వ‌ర్గ‌ధామం కావ‌డంతో భారీ స్కోర్లు న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *