శ్రీరాములోరి కళ్యాణానికి మంత్రి వాకిటికి ఆహ్వానం….

శ్రీరాములోరి కళ్యాణానికి మంత్రి వాకిటికి ఆహ్వానం….
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల కేంద్రంలోని పాతపేట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈనెల 27న నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్సవానికి హాజరుకావాలని రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరికి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం వివిధ సమస్యలను పరిష్కరించాలనివినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు డి. యజ్ఞేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సూర్య ప్రకాశ్ రెడ్డి, లైన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులుఎల్కోటిజనార్దన్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోరమ్ మహేష్ రెడ్డి, వార్డు సభ్యురాలు సువర్ణరవికుమార్, ఆలయ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
