ఆంధ్రప్రభ డస్క్: యూరియా(Urea) బస్తాల కోసం రైతుల అవస్థలు తీరడంలేదు. నిల్వలు రావడంతో తమకు దొరుకుతుందో లేదోనన్న ఆందోళనతో వేకువ జామునుంచే బారులు తీరుతున్నారు. పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలంలో రైతులకు యూరియా వెతలు తీరడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు యూరియా పంపిణీ కోసం క్షేత్రస్థాయిలో గ్రామాలలో ఏర్పాటు చేసినప్పటికీ.. ఆ స్థాయిలో రైతులకు యూరియా అండక ఇబ్బందులు పడుతున్నారు.

తీరని రైతు కష్టాలు
ధర్మారం(dharmaram)మండలం రామయ్యపల్లి(Ramaiah Pally)లోని డీసీఎంఎస్ కేంద్రానికి 270యూరియా బస్తాలు(Urea bags) కేటాయించారు. యూరియా కేంద్రానికి రావడంతో బుధవారం తెల్లవారుజామునే రైతులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆధార్ కార్డులు,(Aadhar cards),చెప్పులు(sandals, పట్టాదారు పాసు పుస్తకాల జిరాక్స్(Xerox of Pattadar pass books) ప్రజలను క్యూ లైన్ లో పెట్టి రైతులు అక్కడే వేచి ఉన్నారు.270 బస్తాల యూరియా కేంద్రంలో ఉన్నప్పటికీ అవి సరిపోవని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి సరిపడా యూరియా తెప్పించి ఇబ్బందులు తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply