ఖిల్లా రామాలయంలో కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు

నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నగరంలోని రఘునాథ స్వామి ఖిల్లా రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె తన భర్త అనిల్‌తో కలిసి సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్న నేపథ్యంలో ఖిల్లా రామాలయంలో నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. కవిత దంపతులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.
