బండి సంజయ్ ప్రత్యేక పూజలు..

కరీంనగర్ కల్చరల్, ఆంధ్రప్రభ : శ్రీ మహా శక్తి దేవాలయం లో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ రోజు విజయదశమి పర్వదినం సందర్బంగా నిర్వహించిన శమి పూజ లో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు.
పూజ అనంతరం జమ్మి ఆకు అందించి భక్తులకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దేవీ నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించామని అమ్మవారి దయ ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు.
