SP | కౌంటింగ్ పూర్తయ్యే వరకు నిరంతర అప్రమత్తత

SP | కౌంటింగ్ పూర్తయ్యే వరకు నిరంతర అప్రమత్తత

  • జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్

SP | అచ్చంపేట, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అధికారులను ఆదేశించారు. సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్ సందర్భంగా ఆయన అచ్చంపేట నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

అచ్చంపేట, బల్మూరు, ఉప్పునుంతల, లింగాల, చారకొండ, అమరాబాద్, పదరా మండలాల్లో పోలింగ్ జరుగుతుండగా మొత్తం 7 మండలాల్లో 158 గ్రామపంచాయతీలకు, 1064 వార్డు మెంబర్ స్థానాలకు ఓటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బల్మూరు, లింగాల మండలాల్లోని పోలింగ్ స్టేషన్లను ప్రత్యేకంగా తనిఖీ చేశారు. పోలింగ్ ప్రక్రియ, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా ఎస్పీ, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

SP

కౌంటింగ్ పూర్తయ్యే వరకు నిరంతర అప్రమత్తత పాటించాలని, బ్యాలెట్ బాక్సులు డిపాజిట్ చేసే వరకూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా ముగియాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిందని జిల్లా ఎస్పీ తెలిపారు.

Leave a Reply