నఖానాముద్యోతైర్నవనళినరాగంవిహసతాం
కరాణాం తే కాంతి కథయకథయామఃకథముమే
కయాచిద్వా సామ్యం భజతుకలయాహంత కమలం
యది క్రీడ ల్లక్ష్మీ చరణ తలలాక్షారసచణం.
తాత్పర్యం: ఓ పార్వతీదేవీ! అప్పుడే వికసిస్తున్న తామరపూలఎఱ్ఱని కాంతులను పరిహసిస్తున్నట్టు ఉన్న గోళ్ళ ప్రకాశంతో శోభిల్లుతున్న నీ అరచేతుల కాంతి వైభవాన్ని ఏ విధంగా వర్ణించగలము? తన యందు క్రీడించు చున్న లక్ష్మీదేవి పాదములకు ఉన్న లత్తుకతో కూడి ఉన్నట్టయితే కమలముల కాంతి నీ చేతుల ఎఱ్ఱని కాంతిలోని పదునారవ వంతుతో పోల్చుటకు ఏదో ఒక విధముగా సరిపోవచ్చునేమో!
- డాక్టర్ అనంతలక్ష్మి