హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రం (Telangana)లో గంజాయి, డ్రగ్స్ (Drugs), ఇతర మత్తు పదార్థాల వినియోగం పట్ల సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు మహేశ్వరం, రాచకొండ ఎస్‌ఓటీ (SOT) పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు.
ఈ మేరకు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ వద్ద తనిఖీలు చేస్తుండగా.. కారులో తరలిస్తున్న సమారు రూ.6 కోట్ల విలువ చేసే గంజాయిని గుర్తించి సీజ్ చేశారు. అనంతరం ముఠాను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

