solution | వెల్లువిరిసిన సంతోషం…

solution | వెల్లువిరిసిన సంతోషం…
solution | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పురపాలక సంఘం చైర్‌పర్సన్‌గా దావ స్వాతి ఎన్నిక కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన ఆమెకు స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పట్టణంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారుల గుండా సాగిన ఈ ర్యాలీలో కార్యకర్తలు టపాసులు కాల్చుతూ, రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత దావ రమేష్…
తన సతీమణి స్వాతి మున్సిపల్ పీఠాన్ని అధిష్టించడం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దావ రమేష్ ప్రత్యేక హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ విజయం బెల్లంపల్లి ప్రజలదని, ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆశీస్సులతోనే మున్సిపాలిటీపై హస్తం జెండా ఎగిరిందని పేర్కొన్నారు.
తన భార్య చైర్‌పర్సన్‌గా పట్టణంలోని ప్రతి గల్లీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తుందని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి పథంలో నడిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, వార్డు కౌన్సిలర్లు పాల్గొని దావ స్వాతి-రమేష్ దంపతులకు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
