Social Media | దర్శకుడు రాజమౌళిపై కేసు
Social Media | సరూర్ నగర్ పోలీసులకు రాష్ట్రీయ వానరసేన ఫిర్యాదు
Social Media | గ్రేటర్ హైదరాబాద్ బ్యూరో ,ఆంధ్రప్రభ : టాలీవుడ్ అగ్రదర్శకుడు రాజమౌళి(Rajamouli)పై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. రాష్ట్రీయ వానరసేన ఆయనపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన గ్లోబ్ ట్రాటర్(the globe trotter) ఈవెంట్ లో ఆయన తనకు దేవుడిపై నమ్మకం లేదంటూ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Social Media | వారణాసి టైటిల్ లాంఛ్ ఈవెంట్ లో చిన్న టెక్నికల్ ఇష్యూ
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో రాజమౌళి అభిమానులకు వరుస సర్ ప్రైజ్ లు ఇచ్చారు. అయితే వారణాసి టైటిల్ లాంఛ్ ఈవెంట్ లో చిన్న టెక్నికల్ ఇష్యూ(Technical Issue) తలెత్తింది. దీంతో కాసేపు కార్యక్రమానికి అంతరాయం ఏర్పడింది. భావోద్వేగానికి గురైన రాజమౌళి తాను అందుకే దేవుడిని నమ్మనన్నారు. కానీ తన తండ్రి విజయేంద్ర(Vijayendra) తన వద్దకు వచ్చి హనుమంతుడే వెనుక ఉండి నడిపిస్తాడని చెప్పారన్నారు. తన భార్య రమకు కూడా ఆంజనేయస్వామి అంటే చాలా ఇష్టమని, ఆయన్ను ఫ్రెండ్(Friend) లా చూస్తుందన్నారు.
కానీ ఈవెంట్లో ఇలా జరిగే సరికి తన భార్య మీద కూడా కోపం వచ్చిందని, దేవుడు ఇలానేనా చేసేది అనిపించిందన్నారు. దేవుడిపై తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతున్నాయి. అలాగే సుమారు 15 సంవత్సరాల క్రితం రాముడిపై ఆయన చేసిన ట్వీట్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి Globetrotter | నాన్న మాట ఇన్నాళ్ళకు విన్నాను!

