TG | స్మైల్ ఫౌండేషన్ ఎన్‌ఎక్స్ కార్నర్ కార్నివాల్..
- ప్రతిభ చాటిన గ్రామీణ విద్యార్థులు
హైదరాబాద్ : షెల్ ఇండియా మద్దతుతో, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి స్మైల్ ఫౌండేషన్, ఖమ్మంలో ఎన్‌ఎక్స్ కార్నర్ కార్నివాల్‌ను నిర్వహించింది. గ్రామీణ పాఠశాలల విద్యార్థులు తమ శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించాలనే లక్ష్యంతో ఈ కార్నివాల్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ డా.పీ.శ్రీజ, జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్‌శర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీజ మాట్లాడుతూ.. ఆదర్శవంతమైన పని చేపడుతున్న స్మైల్ ఫౌండేషన్‌ను అభినందిస్తున్నానన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సృజనాత్మకత, అంకితభావం, అభిరుచులు నిజంగా అత్యాద్భుతంగా ఉన్నాయన్నారు.
విద్యాశాఖ అధికారి సోమశేఖర్‌శర్మ మాట్లాడుతూ… పిల్లలు స్టె మ్‌విద్యతో పాటు ఎస్‌డీజీల పట్ల అవగాహనతో భవిష్యత్తుకు సిద్ధంగా ఉంచాలన్నారు. స్మైల్ ఫౌండేషన్ అనుబంధంతో పురోగతి పట్ల సంతోషంగా ఉన్నామన్నారు.