TG | బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ల్లా యూనివ‌ర్శిటీలో కూలిన స్లాబ్ ..

పొచారం : బీఆర్ఎస్ జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి (Palla Rajeshwar Reddy)కి చెందిన అనురాగ్ యూనివర్సిటీలో నేడు నిర్మాణంలో ఉన్న భ‌వ‌న స్లాబ్ కూలిన ఘ‌ట‌న చోటు చేసుకుంది.. పోచారం (Pocharam) పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ (Venkatapur) సమీపంలో జ‌రిగిన ఈ ప్రమ‌దంలో నలుగురు కూలీలకు గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఇద్దరి కూలీల పరిస్థితి విషమంగా ఉండటంతో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మీడియాను కూడా యూనివర్సిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూలీల కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు ఆస్పత్రికి చేరుకున్నారు.

Leave a Reply