వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరవ వార్షికోత్సవం

వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరవ వార్షికోత్సవం

కమ్మర్ పల్లి,అక్టోబర్ 24 ( ఆంధ్ర ప్రభ ) కమ్మర్ పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా శుక్రవారం జరిగింది. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందని సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఉదయం స్వామివారి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకం, గణపతి పూజ, సత్వి పుణ్యవచనం అలాగే గ్రామం నుండి స్వామివారిని గుట్ట పై తీసుకువచ్చి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించినట్లు తెలిపారు.

పాడిపంటలు, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య, వైస్ చైర్మన్ సుంకెట బుచ్చన్న,తాహసిల్దార్ జి. ప్రసాద్ లు దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బి నరేష్, కార్యదర్శి ఎస్ సుమన్, క్యాషియర్ బి లింగయ్య, సంఘం సభ్యులు నరసయ్య, గోవర్ధన్, అనిల్, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply