రెండుగంట‌ల‌ పాటు శ్ర‌మించిన ఫైర్ సిబ్బంది

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : సికింద్రాబాద్ (Secunderabad) తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధి లోతకుంట ప్రాంతంలో ఈ రోజు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లోతకుంట ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఒక సైకిల్ దుకాణంలో ప్రారంభ‌మైన‌ మంటలు పక్కనే ఉన్నఇతర దుకాణాలకు అతివేగంగా మంట‌లు వ్యాపించాయి. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది.

ప్ర‌మాదంలో ఆరు దుకాణాలు (Six shops) పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో.. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్ర‌మాద‌ సమయంలో దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రాథమిక విచారణలో అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణమై ఉండవచ్చని అగ్నిమాపక అధికారులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న తిరుమలగిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply