Sivaratri | శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు..

Sivaratri | శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు..
Sivaratri, వర్ధన్నపేట, ఆంధ్రప్రభ : శివనామస్మరణతో శివాలయాలు మార్మోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వర్ధన్నపేట మండలంలోని శివాలయాల్లో తెల్లవారుజామున 4 గంటల నుండి భక్తులు పూజలు ప్రారంభించారు. మండలంలోని ఇల్లంద గ్రామ శివారులో ఆకేరు వాగు ఒడ్డున శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
