వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం

వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం
- వేడుకల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు
మక్తల్, ఆంధ్రప్రభ ; శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో వద్ద రామ్ లీలా మైదానంలో సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రామ్ లీలా మైదానంలో వేలాదిమంది భక్తుల మధ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త పి.ప్రాణేషాచార్య ఆధ్వర్యంలో ప్రాణేషాచారి గాయత్రి దంపతుల ఆధ్వర్యంలో విధ్వాన్ రాఘవేంద్ర ఆచార్య సీతారాముల కళ్యాణం జరిపించగా విద్వాన్ రాఘవేంద్ర ఆచార్య వేదమంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి దంపతులు భద్రాచలం లో శ్రీ రామ నవమి వేడుకలకు హాజరు కాగా మంత్రి సోదరుడు వాకిటి శేషగిరి రాధిక దంపతులు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాజాబజంత్రీల మధ్య రామ్ లీలా మైదానానికి ఊరేగింపుగా పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు తీసుకువచ్చి అర్చకులకు అందజేశారు. అదేవిధంగా సంగంబండ కు చెందిన గవినోళ్ళ మంజుల బాలకృష్ణ రెడ్డి దంపతులు సమర్పించారు.

ప్రతి ఏడాది మాదిరిగా దామోదర జువెల్లర్స్ యజమాని తాళం పల్లి రమేష్,కాత్త శ్రీనివాస్ గుప్తా కూడా స్వామివారికి ముత్యాల తలంబ్రాలను ఆనవాయితీగా అందజేశారు. రామ్ లీలా మైదానం లో జరిగిన కళ్యాణ మహోత్సవం వేడుకలకు వేలాది మంది భక్తులు తరలి వచ్చి తిలకించారు. వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య రాముల వారి కల్యాణ వైభోగం కన్నుల పండువగా సాగింది. సందర్భోచితంగా విద్వాన్ రాఘవేంద్ర ఆచార్య రామాయణ ఇతిహాసాలను ఘట్టాలను భక్తులకు వివరించారు.

రాములవారి 14 ఏళ్ళ అణ్యవాసం ఆ తరువాత పట్టాభిషేకం రాజ్య పాలన వంటి అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో లో స్థానిక మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి,మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానస హన్మంతు, మార్కెట్ చైర్పర్సన్ జి.రాధాలక్ష్మారెడ్డి,మాజీ ఎంపీపీ బిజెపి రాష్ట్ర నాయకులు కొండయ్య ,బికెఆర్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి. నరసింహ గౌడ్ ,బిఆర్ఎస్ నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్తా ,వివిధ పార్టీల నాయకులు జి.గోపాల్ రెడ్డి,బి.రాజశేఖర్ రెడ్డి, పికె.నర్సింహ ,కావలి తాయప్ప , దేవరింటి నరసింహారెడ్డి ,రాజాగౌడ్,కట్ట సురేష్ కుమార్ గుప్తా, అమరేందర్ రెడ్డి, బి.గణేష్ కుమార్, బోయ రవికుమార్, కావలి శ్రీహరి,ఆలయ సిబ్బంది అరవింద చారి ,కుమ్మరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సీతారాముల కల్యాణం సందర్భంగా స్థానిక సిఐ రామ్ లాల్,ఎస్సై వై.భాగ్యలక్ష్మి రెడ్డి, రేవతి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. దేవాలయం నుండి సంగంబండ రోడ్డు కళ్యాణం సమయంలో మూసివేశారు. ఈ సందర్భంగా సంగంబండకు చెందిన గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి మంజుల దంపతుల భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
