చంద్రబాబును కలసిన సిక్కోలు మహిళలు
శ్రీకాకుళం, సెప్టెంబర్ 24 ఆంధ్రప్రభ : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)ను సిక్కోలు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు బుధవారం సచివాలయంలో కలిశారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్(Gondu Shankar) సహకారంతో సీఎం చంద్రబాబును సిక్కోలు(Sikkolu) మహిళా నాయకులు కలసి ఆనందం వ్యక్తం చేశారు.
అలాగే నియోజకవర్గంలో టీడీపీ(TDP) పరిస్థితిని, పార్టీలో వారు చేసిన కృషి గురించి చంద్రబాబుకు వివరించారు. ఆయన మహిళా నాయకులతో మాట్లాడుతూ, పార్టీ కోసం చిత్తశుద్ధితో కష్టపడి పని చేసే వారికి మంచి భవిష్యత్(Bhavishyat) ఉంటుందన్నారు. నిజాయితీతో పనిచేసే వారికి పదవులు తప్పక వరిస్తాయని చెప్పారు. దీంతో మహిళా నాయకులంతా ఆనందం వ్యక్తం చేశారు.

