Police Quarters | లంచంతో పట్టుబడ్డ ఎస్‌ఐ

Police Quarters | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లా మామడ పోలీసు క్వార్టర్స్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటున్న సమయంలో మామడ ఎస్‌ఐ తీగల అశోక్‌ను అధికారులు రంగే చేత పట్టుకున్నారు.
భూవివాదంలో జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం కోసం ఎస్‌ఐ అశోక్ రూ.40 వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇవాళ రూ.20 వేల నగదు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి అతడిని పట్టుకున్నారు. అనంతరం పోలీసు క్వార్టర్స్‌లో సోదాలు నిర్వహించిన అధికారులు, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
