Shyam Prasad Lal | విద్యార్థులు ప్రయోజకులు కావాలి..

Shyam Prasad Lal | విద్యార్థులు ప్రయోజకులు కావాలి..

  • తల్లిదండ్రుల కలలు నిజం చేయాలి..
  • బీసీ గురుకులాల కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ లాల్

Shyam Prasad Lal | తిమ్మాపూర్, ఆంధ్రప్రభ : విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు కావాలని తెలంగాణ బీసీ గురుకులాల కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ లాల్ పిలుపునిచ్చారు. ఇవాళ‌ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని పీఎం శ్రీ మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల/కళాశాలను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యాల కల్పన, విద్యాభ్యాసం తీరుపై ఆరా తీశారు.

Shyam Prasad Lal

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం బీసీ గురుకులాల్లో సకల సౌకర్యాలు కల్పిస్తుందని, లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ.. ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. విద్యార్థులు సైతం ప్రభుత్వం కల్పిస్తున్న సౌకరయాలను సద్వినియోగం చేసుకొని ప్రయోజకులు కావాలన్నారు. తల్లిదండ్రుల కలలను నిజం చేసే దిశగా కష్ట పడి చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పాఠశాలతోపాటు వంట గదిని ఇతర సౌకర్యాలను పరిశీలించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు పాఠశాల విద్యార్థులు గురుకులాల కార్యదర్శి శ్యామప్రసాద్ లాల్క మొక్కలను అందించి స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply