రైతులందరికీ అందించాల్సిందే!!
- యూరియా కోసం రైతుల నిరీక్షణలు
- మండల కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు
శావల్యాపురం, ఆంధ్రప్రభ : రైతులు వ్యవసాయ పనులు మానుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు మండల కేంద్రం చుట్టూ యూరియా(Urea) కోసం ప్రదక్షిణాలు చేసే అవస్థలకు స్వస్తి పలికే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామల్లో ఉన్నరైతు సేవ కేంద్రాలకు కూడా యూరియా అందించాలని రాష్ట్ర రైతు సంఘం నాయకులు డిమాండ్(demand) చేశారు.
మండల కేంద్రమైన శావల్యాపురం(Savalyapuram) వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ అధికారి రామినేని రామారావును కలిసి మంగళవారం వినతి పత్రం అందజేశారు. సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్(Kharif season) ప్రారంభం నుండి రైతులు యూరియా కొరకు కుస్తీలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలుకుబడి కలిగిన ధనిక రైతు వర్గం యూరియాను నిల్వ చేసుకోగలిగారని సన్న, చిన్నకారు, కౌలు రైతులకు యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయన్నారు.
ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి సన్న, చిన్నకారు, కౌలు రైతులకు యూరియా అందించేందుకు రైతు సేవ(farmer service) కేంద్రాల ద్వారా ఈ- క్రాప్ బుకింగ్( e- crop booking) చేసుకుని ప్రభుత్వం నిర్దేశించిన కోటా ప్రకారం ప్రతి రైతుకు ఎరువులు అందించాలని రైతు సంఘం తరపున డిమాండ్ చేశారు. వినతిపత్రం అందించిన రైతు సంఘం నాయకులు కెవిఆర్ మోహన్ చంద్, చిమట ఆంజనేయులు, గణపర్తి వెంకటేశ్వర్లు ఉన్నారు.

