Short circuit | పాఠశాలలో అగ్నిప్రమాదం

Short circuit | పాఠశాలలో అగ్నిప్రమాదం

Short circuit | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని శ్రద్ధ ప్రైవేట్ పాఠశాలలో ఇవాళ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి భవనం మొత్తం వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం.

అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్కూల్ కి సెలవు ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాద సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

Leave a Reply