ప్రయాణికుల సౌకర్యాన్ని నిర్లక్ష్యం చేసినందుకు IndiGo ఎయిర్‌లైన్స్‌కు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఢిల్లీ వినియోగదారుల ఫోరం, ఒక మహిళా ప్రయాణికురాలికి అపరిశుభ్రమైన, అసౌకర్యకరమైన సీటు కేటాయించిన కేసులో IndiGoకు రూ.1.5 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని ఆమెకు పరిహారంగా చెల్లించాలని స్పష్టం చేసింది.

ఈ ఘటన ఈ ఏడాది జనవరి 5న బాకు–న్యూఢిల్లీ ఇండిగో విమానంలో జరిగింది. ప్రయాణికురాలికి కేటాయించిన సీటు శుభ్రంగా లేకపోవడంతో అసౌకర్యానికి గురైన మహిళ, వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం, ఫోరం ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చి, జరిమానాతో పాటు కేసు కోసం ఖర్చు చేసిన రూ.25,000 కూడా తిరిగి చెల్లించాల్సిందిగా ఇండిగోకు ఆదేశించింది.

Leave a Reply