హైదరాబాద్ – హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర గౌలిగూడ నుంచి నేటి మధ్యాహ్నం ప్రారంభమైంది.. గౌలిగూడ నుంచి కోరి, నారాయణగూడ బైపాస్ మీదుగా సికింద్రాబాద్ లోని తాడ్ బండ్ హనుమాన్ ఆలయం వరకు ఈ ర్యాలీ సాగనుంది. భక్తులు భారీగా తరలివచ్చి పాల్గొన్నారు. ఈ శోభాయాత్రలో వేలాది వాహనాలతో పాటు లక్షలాది మంది భక్తులు పాల్గొనడటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
12 కిలోమీటర్ల యాత్రకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ గౌలిగూడలోని శ్రీరామ మందిరానికి చేరుకుని భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.
శోభాయాత్ర వెళ్లే మార్గంలో… శోభాయాత్ర వెళ్లే మార్గంలో పోలీసులు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శోభాయాత్ర ప్రారంభం కానుండటంతో ప్రత్యామ్యాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు వాహనదారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.

కర్మన్ ఘాట్ లోనూ..
కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం నుంచి వీర హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. సైదాబాద్, మాదన్నపేట మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది.