మంత్రి పదవి రావాలని రాజశ్యామల యాగం…

మంత్రి పదవి రావాలని రాజశ్యామల యాగం…

మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని శివరామ క్షేత్ర ఆలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి రావాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు జంగిలి నాగరాజు ఆధ్వర్యంలో మండలానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి రాజ శ్యామల యాగం ఘనంగా నిర్వహించారు. ఉదయం పుణ్యస్నానం అనంతరం నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో యాగంలో పాల్గొన్న నాయకులు సుమారు నాలుగున్నర గంటల పాటు నిరంతర మంత్రోచ్చారణల మధ్య యాగాన్ని పూర్తి చేశారు.

ఈ సందర్భంగా యాగంలో పాల్గొన్నవారు రాష్ట్ర అభివృద్ధికి, నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి సేవలు మరింతగా ఉపయోగపడాలని ప్రార్థించారు. అనంతరం పండితులు యాగ నిర్వాహకులకు వేద ఆశీర్వచనాలు అందించి యాగ ఫలితాలను వివరించారు.ఈ కార్యక్రమంలో మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply