Shamshabad | తప్పిపోయిన బాలుడు సురక్షితం
Shamshabad | శంషాబాద్, ఆంధ్రప్రభ : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) పార్కింగ్ ప్రాంతంలో తప్పిపోయిన 6 ఏళ్ల బాలుడు మహమ్మద్ అబ్దుల్ సబూర్ (Mohammed Abdul Saboor) ను RGIA పోలీసులు వేగవంతంగా గుర్తించి, సురక్షితంగా కుటుంబానికి అప్పగించారు. జహీరాబాద్‌కు చెందిన మహమ్మద్ ఫహీమ్ కుమారుడైన ఈ బాలుడు మామతో విమానాశ్రయానికి వచ్చాడు.
మామ వాహనం వద్ద నుండి కొద్దిసేపు దూరంగా వెళ్లిన సమయంలో బాలుడు వాహనం నుండి బయటకు వచ్చి అక్కడి నుంచి తప్పిపోయాడు. పార్కింగ్‌లో ఏడుస్తూ ఉన్న బాలుడిని గమనించిన ఒక ప్రయాణికుడు వెంటనే RGIA పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చాడు. భయంతో వణికిపోతున్న బాలుడిని ధైర్యం చెప్పేందుకు పోలీసులు (police) ఐస్‌క్రీమ్ కొనిచ్చి మనసు ప్రశాంతం చేశారు. మొదట తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ సరిగా చెప్పలేకపోయినా, ఓర్పుతో పలుమార్లు ప్రశ్నలు అడిగి చివరకు సరైన నంబర్ తెలుసుకున్నారు. SHO సంపతి కనకయ్య పర్యవేక్షణలో బాలుడి మామను గుర్తించి సురక్షితంగా అప్పగించారు. కుటుంబ సభ్యులు RGIA పోలీసుల వేగవంతమైన స్పందన, ఓర్పు, మానవతా దృక్పథం పట్ల హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

