రాకపోకలకు తీవ్ర అంతరాయం

తొర్రూరు, ఆంధ్రప్రభ : మొంథా తుఫాన్ ప్రభావం వలన తొర్రూరు మండల వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడుతుంది. దీంతో పాలకుర్తి నియోజకవర్గ(Palakurthy Constituency పరిధిలోని అన్ని మండలాలతో పాటు, తొర్రూరు మండల వ్యాప్తంగా ప్రధాన పంటలైన వరి, పత్తి, మొక్కజొన్న, మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పాలి.

ఆరుగాలం శ్రమించి పంట చేతికొచ్చే సమయానికి వర్షం కారణంగా పంటలు నీట మునగడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈసారి తుఫాన్ చాలా వేగంగా విస్తరించి, రైతులను పెద్ద మొత్తంలో ఊబిలోకి నెట్టింది.

బుధవారం నుంచి ఉపశమనం లేని భారీ తుఫాన్ వల్ల భారీ వర్షాలు కురిసి జనం జీవితాలను దెబ్బతీస్తూ పల్లె ప్రాంతాల్లో విస్తృతంగా పంట పొలాలను నాశనం చేసింది. వరి, పత్తి, మిరప పంటలు గాలి తుఫానుతో రైతులకు ఆర్థిక నష్టం ఎక్కువ జరిగింది. ప్రస్తుతం పడిన వర్షానికి 80 శాతం వరకు పంటలు దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు.

దీని పై పూర్తి స్థాయి నివేదికలు రెండు రోజుల్లో తయారు చేసి జిల్లా అధికారులకు(district officials పంపుతామని వ్యవసాయ అధికారి రాం నర్సయ్య తెలిపారు. మండల వ్యాప్తంగా భారీ వర్షంతో పాటు ఈదురు గాలులు వీస్తుండడంతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి చెట్లను తొలగిస్తున్నారు. కూలిన విద్యుత్‌ స్తంభాల(electricity poles స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి సరఫరాను పునరుద్ధరిస్తున్నారు.

ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో గ్రామీణ రహదారులు పాడైపోతున్నాయి. సోమారం – గుర్తురు(Somaram – marks) గ్రామాల మధ్య ఉన్న లో లెవెల్ కల్వర్టు(low level culvert) పై నీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కంటయపాలెం నుండి తొర్రూర్ కు వెళ్లే దారిల, తొర్రూరు నుండి వెంకటాపురంకు వెళ్లే దారిలో నీటి ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి.

తహసిల్దార్ శ్రీనివాస్(Tahsildar Srinivas), ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎస్సై ఉపేందర్ లు ఆయా ప్రాంతాల్లో పర్యటించి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. భారీ వర్షం నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అధికారులు భారీకేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలు ఎవరు బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Leave a Reply