సమాజ సేవ చేయడం దైవ సేవతో సమానం…

బోధన్, ఆంధ్రప్రభ : సమాజ సేవ చేయడం దైవ సేవ చేయడంతో సమానమని సోలిసిటర్ జనరల్ కనక మేడల రవీంద్ర కుమార్ అన్నారు.శుక్రవారం బోధన్ పట్టణ శివారు లోని కాకతీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యార్థుల వసతి గృహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచే సిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికి వారి పిల్లల విద్యావంతులను చేయడానికి చేస్తున్న కృషిని అభినందించారు.

సమాజ అభివృద్ధికి తోడ్పడ్డం దైవానికి సేవ చేయడం లాంటిదేనని అన్నారు. ఎవరి వృత్తిని వారు దైవంగా భావించి కృషి చేస్తే సమాజంలో అసమానతలు తొలగుతాయన్నారు.ఈ కార్యక్రమం లో కమ్మ సంఘం అధ్యక్షులు శివన్నారాయణ,సహకార సంఘ మాజీ అధ్యక్షులు అమరనాద్ బాబు,డాక్టర్ సునీల్ కుమార్,సంఘ కార్యదర్శి హరినాద్ బాబు, సుబ్బారావు, రంగారావు కౌన్సిలర్ ఆదినారాయణ,సర్పంచ్ కనక మేడల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply