అంబేద్కర్ సంఘం అధ్యక్షులుగా గజ్జల సురేష్

అంబేద్కర్ సంఘం అధ్యక్షులుగా గజ్జల సురేష్

భీమదేవరపల్లి, ఆంధ్రప్రభ : దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వగ్రామమైన వంగరలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడిగా గజ్జల సురేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే విధంగా నూతన అధ్యక్షుని సేవా కార్యక్రమాలు ఉంటాయని గ్రామస్తులు, దళిత బహుజన నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అద్భుతంగా నూతన అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశలకు అనుగుణంగా ప్రజలలో సామాజిక చైతన్యాన్ని కలిగించే కార్యక్రమాలను చేపడతానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు మాట్ల వెంకటస్వామి, కండే రమేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply