ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లు నేడు నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.19 సమయంలో సెన్సెక్స్ (Sensex down) 108 పాయింట్లు నష్టపోయి 81,536, నిఫ్టీ 33 పాయింట్లు కుంగి 24,947 వద్ద కొనసాగుతున్నాయి. గెలాక్సీ సర్ఫాక్ట, పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్, మాక్స్ ఎస్టేట్, లాయిడ్స్ మెటల్స్ లాభాల్లో ఉండగా.. నజరా టెక్నాలజీస్, డెల్టాకార్ప్, సీఎస్‌బీ బ్యాంక్, పవర్ మెక్ ప్రాజెక్ట్స్ నష్టాల్లో ఉన్నాయి. నాలుగు రోజులుగా సూచీలు భారీగా పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు.
నేడు రూపాయి మారకం విలువ భారీగా పతనమై ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది. నిన్నటి రూ.86.95తో పోలిస్తే 21 పైసలు తగ్గి రూ.87.16 వద్ద ఉంది. ఇక ఆసియా పసిఫిక్ మార్కెట్ ప్రధాన సూచీలు ఆస్ట్రేలియా ఏసీఎక్స్ 200, న్యూజిలాండ్ ఎన్‌జెడ్‌ఎక్స్ 50 మినహా మిగిలిన ప్రధాన సూచీలు కుంగాయి. చైనాకు చెందిన షాంఘై, జపాన్ నిక్కీ, హాంకాంగ్ హెచ్‌ఎస్‌ఐ, దక్షిణ కొరియా కోస్పి, తైవాన్ సూచీలు పతనం అయ్యాయి.