జూనియర్ పై సీనియర్ల దాష్టీకం

పుత్తూరులో సంచలనం
( ఆంధ్రప్రభ, పుత్తూరు) : తిరుపతి జిల్లా (Tirupati District) పుత్తూరు (Puttur)లోని సిద్ధార్థ కాలేజీ హాస్టల్‌లో విద్యార్థులు రెచ్చిపోయారు. ఓ యువతి ప్రేమ వ్యవహారంలో జూనియర్ విద్యార్థిని సీనియర్లు చితకబాదారు. కాళ్లతో విచక్షణారహితంగా తన్నుతూ దాడిచేయగా.. మిగిలిన విద్యార్థులు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ప్రాథమిక సమాచారం మేరకు సిద్ధార్థ కాలేజీ లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి పై దాడి చేసిన రెండవ సంవత్సరం సీనియర్ విద్యార్థులు.. ఒక బీసీ విద్యార్థిని కొడుతూ సెల్ ఫోన్ లో చిత్రీకరించారు.ఈ విషయం బయటికి చెప్తే చంపేస్తా అంటూ బెదిరించారు. ఈ మేరకు బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్ధార్థ కాలేజీ యాజమాన్యం స్పందించింది. ఆరుగుర్ని సస్పెండ్ చేసింది. కాగ మరో నలుగురు సంపన్న విద్యార్థులపై చర్యలు తీసుకోలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
