ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

టేకుమట్ల, ఆంధ్రప్రభ : విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివినప్పుడే తమ లక్ష్యాలను సాధించగలరని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంమధు, డైరెక్టర్ కారుకూరి నారాయణ అన్నారు. మండల కేంద్రంలోని నవచైతన్య స్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతుల్లో పాఠాలు బోధించారు. ఒక రోజు డీఈవో, ఎంఈవో, పీఈటీ, హెచ్ఎంగా బాధ్యతలు చేపట్టడం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రలను సమర్థంగా పోషించి చక్కగా బోధించడం విశేషం.
విద్యార్థుల వేషధారణ కూడా ఆకర్షణీయంగా ఉండింది. అనంతరం విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామ్మూర్తి, రాజేశ్వరి, సుమలత, ప్రియాంక, నితీష్ చైతన్య, యస్. స్వరూప, జె. స్రావణి తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.
