Selected | రాష్ట్ర స్థాయి పరీక్ష పోటీలకు విద్యార్థి ఎంపిక….

Selected | దండేపల్లి, ఆంధ్రప్రభ : 10వ తరగతి సోషల్ స్టడీస్ పోటి పరీక్షలకు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి పోటీలకు దండేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఆర్ జశ్విత్ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంఘర్శ రాజేశ్వర్ రావు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన జిల్లా స్థాయి లో జరిగిన సోషల్ స్టడీస్ ప్రతిభా కనబర్చడంతో, ఇంగ్లీష్ మీడియం విభాగంలో తృతీయ స్థానం పొంది, ఈనెల 9న జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థికి మెడల్ తో పాటు మెమొంటు అందజేశారు. విద్యార్థి ఆర్ జశ్విత్ ను సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు సృజన,సిహెచ్. రాజన్న, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Leave a Reply