ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట…

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట…
ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో సీసీరోడ్డు పనులు ప్రారంభించిన నాయకులు….
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రజా పాలన ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఊట్కూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు డి.యగ్నేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సూర్యప్రకాశ్ రెడ్డి, కొల్లూర్ సర్పంచ్ సింగారం సువర్ణ శ్రీనివాస్ అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని కొల్లూర్ లో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ. 6 లక్షలతో సిసి రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పల్లె సీమలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని అన్నారు.
మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో ఊట్కూర్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామనిఅన్నారు. ఎస్సీ ఎస్టీలు నివసించే కాలనీలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎస్సీసబ్ ప్లాన్ నిధులు మంజూరు చేస్తుందనిఅన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టిందని ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా హాజరు కావాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమని రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. గ్రామాల్లో నెలకొన్న వివిధ సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు చక్కని వేదిక ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అభివృద్ధికి బాటలు వేస్తుందని అన్నారు. ప్రజలు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగాఅభివృద్ధిచెందాలన్నారు.
కొల్లూర్ గ్రామ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సమస్త పూర్ సర్పంచ్ జయప్రకాశ్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు ఆనంద్ రాజ్, మాజీ సర్పంచ్ సరోజసమృద్ధి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
