Damodar Rajanarsimha | సౌదీ ప్రమాద ఘటన బాధాకరం

Damodar Rajanarsimha | సౌదీ ప్రమాద ఘటన బాధాకరం

వైద్య ఆరోగ్య మంత్రి తీవ్ర దిగ్బ్రాంతి


Damodar Rajanarsimha | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదార్ రాజనర్సింహ (Damodar Rajanarsimha) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఉమ్రా యాత్రికులు, హైదరాబాద్‌కు చెందిన పలువురు మరణించారు.

ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాదకర సంఘటన మొత్తం రాష్ట్రానికి వేదనను కలిగించిందని పేర్కొన్నారు. సౌదీ అరేబియా(Saudi Arabia) లోని భారత రాయబార కార్యాలయం సంబంధిత అధికారులతో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం మాట్లాడుతుందని, మరణించినవారి గుర్తింపు, వారి మృతదేహాల తరలింపునకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ఈ కష్టకాలంలో ధైర్యం లభించాలని మంత్రి ప్రార్థించారు.

Leave a Reply