Sarpanch post | అవకాశం ఇస్తే ప్రజా సేవకు అంకితమవుతా…

Sarpanch post | అవకాశం ఇస్తే ప్రజా సేవకు అంకితమవుతా…
Sarpanch post | ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ గ్రామ అభివృద్ధి జరగాలంటే ఈనెల 17న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కత్తెర గుర్తు పై ఓటేసి గెలిపించాలని గ్రామాల్లోని వీధుల్లో ఇంటింటా తిరుగుతూ ఈ రోజు విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. గ్రామంలో నెలకొన్న అన్ని సమస్యలను తాను సర్పంచ్ పదవి బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే అన్ని తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చా రు. ముఖ్యంగా గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ వ్యవస్థ. సీసీ రోడ్ల సమస్యలను పరిష్కరించేందుకు మొదటి ప్రాద్యతాను ఇస్తానని హామీ ఆమె హామీ ఇచ్చారు. అన్నివెలలో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చి గ్రామంలో విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. ప్రజలు అవకాశం ఇస్తే గ్రామాల్లోని మౌలిక వసతుల కల్పనకు దశలవారీగా కృషి చేస్తారని అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అన్నివేళల గ్రామం పై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలకు పరిష్కారం చూపిస్తానని పేర్కొన్నారు. ఆమెతోపాటు మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు.
