Sarpanch | నామినేషన్ కోసం బారులు

Sarpanch | నామినేషన్ కోసం బారులు

Sarpanch | ఉట్నూర్, ఆంధ్రప్రభ : పంచాయతీ ఎన్నికల బరిలో దిగడానికి ఈ రోజు నామినేషన్‌ల దాఖలుకు చివరి రోజు కావడంతో క్లస్టర్ నామినేషన్(Cluster nomination) కేంద్రాల వద్ద సర్పంచ్, వార్డు మెంబర్లకు పోటీ చేయడానికి నామినేషన్ దారులు బారులు తీరారు.

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని దంతన్ పెల్లి క్లస్టర్ నామినేషన్ కేంద్రంలో అధిక సంఖ్యలో నామినేషన్ దారులు బారులు తీరారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ కేంద్రంలో నామినేషన్ పత్రాలను అధికారులకు అందించి ఒక్కొక్క నామినేషన్ పత్రాలను నమోదు చేయించుకుంటున్నారు.

నామినేషన్ ప్రక్రియ ఇంకా ఆలస్యమయ్యే పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈసారి జరిగే పంచాయతీ ఎన్నికల్లో యువతుల పోటీ అధికంగా నెలకొనడం అందులో యువకులు, యువతులు సైతం ఎన్నిక‌ల‌ బరిలో దిగడం జరుగుతుంది. సర్పంచ్ ఎన్నికల్లో(Sarpanch elections) ప్రముఖులు సైతం కొన్నిచోట్ల బరిలో దిగుతున్నారు. నామినేషన్ ప్రక్రియ చాలా ఆలస్యమయ్యే పరిస్థితిలు నెలకొన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply