హెల్త్ క్యాంప్ ప్రారంభించిన సర్పంచ్

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్మర్ పల్లి ( ప్రభుత్వ ఆసుపత్రి) ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్ సిడి హెల్త్ క్యాంప్ ని గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో 30 సంవత్సరాల వయస్సు ఫైబడిన వారందరికీ బి .పి ,షూగర్ పరీక్షలు, నార్మల్ ఫివర్,కోల్డ్, కఫ్ మరియు నార్మల్ డీజీసెస్, ఎక్స్ రే లూ తీసి మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తక్కురి ముత్యం,మహేందర్ సర్,గ్రామ వార్డ్ సభ్యులు, సంతోష్, అనిల్, రాకేష్, అజయ్, సాదుల్లా, సతీష్ మరియు ప్రభుత్వ వైద్యులు,వైద్య అధికారులు, వైద్య సిబ్బంది,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
