ఉపాధి హామీ పనులను ప్రారంభించిన సర్పంచ్

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని బాబా పూర్ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పనులను మంగళవారం సర్పంచ్ మెస్రం గంగాదేవి ప్రభాకర్ ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయ భూముల్లో మట్టి కాలువల తవ్వకాల పనులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఉపాధి హామీ కూలికి పని కల్పించేలా చూడాలని రైతులకు ప్రజలకు ఉపయోగపడే పనులను చేయాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్,ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
