మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి..

కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : మహిళలు అన్ని రంగాల్లో రాణించి సమాజ అభివృద్ధికి ముందుండాలని పెద్దూర్–కడెం గ్రామపంచాయతీ సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్ అన్నారు. ఆదివారం కడెం మండల కేంద్రంలోని కడెం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ శివకుమార్, సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం కడెం పీహెచ్‌సీ పరిధిలో పనిచేస్తున్న హెల్త్ సూపర్‌వైజర్ నిర్మల, ఎంఎల్‌హెచ్‌పీలు జెస్సీ, రేణుక, మౌనిక, ఏఎన్‌ఎంలు సృజన, లక్ష్మీ, రాధ, ఆశా వర్కర్లు పార్వతి, భాగ్య, వరలక్ష్మిలను సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్ శాలువాలతో సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్లు నరసయ్య, ఐతం రాజేశ్వర్, భూమేష్, సిబ్బంది విజయ్, సంతోష్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply