Sarandi | గ్రామాభివృద్ధికి బాటలు వేస్తా..

Sarandi | గ్రామాభివృద్ధికి బాటలు వేస్తా..

Sarandi Sarpanch, వాంకిడి, ఆంధ్రప్రభ : అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్టాపన మూడవ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా వాంకిడి మండలంలోని సరండి తదితర గ్రామాల్లో నిర్వహించారు. రామాలయంలో అందరూ కలిసికట్టుగా శ్రీరామునికి పూజలు చేసారు. అన్నదాన మహా ప్రసాదం ఏర్పాటు చేశారు. రాత్రంతా జాగారం చేసి దేవుని నామ జపంతో భజన చేశామన్నారు. అనంతరం కండువలను పెద్దలు సర్పంచ్, వార్డు సభ్యులకు బహుకరించారు. గ్రామస్తులందరూ భక్తిశ్రద్ధలతో తిలకించారు. అయోధ్య రామమందిరంలో బాల రాముని విగ్రహం ప్రతిష్ఠాపన హిందువులకు ఒక గొప్ప ఆధ్యాత్మిక ఘట్టం. ఇప్పుడు మూడేళ్ల వార్షికోత్సవ వేడుకలు జరిపామని గ్రామస్తులు తెలిపారు.

ఈ సందర్భంగా సరండి గ్రామపంచాయతీ సర్పంచ్ మొహార్లే బాపూజీ మాట్లాడుతూ.. శ్రీరామ రాజ్యాంగ గ్రామపంచాయతీ అభివృద్ధికి బాటలు వేస్తానని తెలియచేశారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనులు చేయిస్తానని.. ముఖ్యంగా గ్రామాల్లోని సమస్యలను పరిష్కారిస్తానని చెప్పారు. ఈ వేడుకలతో గ్రామాల్లో రామనామంతో భక్తి వాతావరణం నెలకొంది.

Leave a Reply