Sangam | ఉచిత మెగా వైద్య శిబిరం

Sangam | ఉచిత మెగా వైద్య శిబిరం

  • సందర్శించిన ఏసిపి, ఎస్ఐ

Sangam | సంగెం, ఆంధ్రప్రభ : మండలంలోని పల్లార్గూడ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మామునూరు ఏసీపీ ఎన్ వెంకటేష్, వంశీకృష్ణ సందర్శించారు. ఎన్ఎస్ఎస్, ఎస్బిఐటి వారి ఆధ్వర్యంలో తెలంగాణ పోలీస్ అకాడమీ డీసీపీ మధుకర్ స్వామి మార్గం దేశంలో నిర్వహిస్తున్న రెండు రోజుల ఉచిత వైద్య శిబిరాన్ని ఏసీపీ సందర్శించిన అనంతరం మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో హైదరాబాద్ కు చెందిన యశోద హాస్పిటల్, అగర్వాల్ హాస్పిటల్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, శ్రీ చక్ర హాస్పిటల్, కూరపాటి లాప్రోస్కోపీ తదితర ప్రముఖ హాస్పిటల్స్ కు చెందిన అనుభవజ్ఞులైన వైద్య బృందంతో పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తుండ‌డం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

Sangam

రెండు రోజులుగా నిర్వహిస్తున్న శిబిరాన్ని నిన్నటి రోజున 600 మందికి, ఈరోజు మధ్యాహ్నం వరకు శ్రీ రత్న విద్యాలయం 100 మంది విద్యార్థినీ విద్యార్థులకు గ్రామస్తులు 400 మందికి, మొత్తం 500 నేటి రోజున, రెండు రోజుల్లో కలిపి మొత్తం 1100 మందికి వైద్య సేవలు అందించి, ఉచిత మందులు అందించడం అభినందనీయమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏసిపి ఎన్ వెంకటేష్, ఎస్సై వంశీకృష్ణ తో పాటు పల్లార్గూడ సర్పంచ్ గుగులోతు సరోజన సమ్మయ్య, ఉపసర్పంచి బొమ్మ కోటేశం, మాజీ ఎంపీపీ కక్కెర్ల సదానందం గౌడ్, విధాత స్కూల్ కరస్పాండెంట్ సింగారపు లక్ష్మణ్, శ్రీరత్న కరస్పాండెంట్ మచ్చిక వెంకటేశ్వర్లు శ్రీలత ఉపాధ్యాయినీలు వనజ, మంజుల, రమ్యశ్రీ, సంధ్యా, ప్రవళిక, విద్యార్థిని విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply