- ఈ మహత్కార్యం వెనుక శ్రీనివాస్ బలమైన ప్రోత్సాహాన్ని అభినందించాలి.
- శృంగేరి చండీ యాగకర్త నిమ్మకంటి శర్మ ఆశీర్వచనం
హైదరాబాద్ : భారతీయ సనాతనధర్మం ప్రసాదించిన సర్వ మంగళప్రదమైన, సర్వశక్తిమంతమైన శ్రీ గణపతి నవరాత్రుల ఉత్సవాలను వైదిక మార్గంలో సలక్షణంగా జరుపుకుంటున్న డ్రీమ్ విల్లాస్ గ్రూప్ కుటుంబ సభ్యుల ఐకమత్యం చాలా పవిత్రంగా ఆకట్టుకుంటోందని శృంగేరి సంస్థాన పీఠాధీశ్వరులు భారతీ తీర్ధ మహాస్వామి అనుగ్రహబలంతో వందల చండీ యాగాలు నిర్వహించిన వేదవిదులు , వైదిక మార్గ ప్రవర్తకులు నిమ్మకంటి శ్రీనివాస శర్మ పేర్కొన్నారు.
అభయ గణపతి దేవాలయ ప్రాంగణంలో అత్యద్భుతంగా జరుగుతున్న గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా డి.వి.ఆర్ అసోసియేషన్ ఆధ్వర్యంలోమంగళవారం రాత్రి ఘనంగా ఏర్పాటైన సహస్రమోదక హోమ మహాక్రతువును ఆయన పవిత్ర విలువల మధ్య నిర్వహించారు.
అనంత మహిమల మంత్రసమూహాలతో గోదావరి జిల్లాలు కేంద్రంగా ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ ఇలాంటి శ్రీకార్యాల వెనుక అక్కడినుంచే బలమైన గాఢ రసభక్తిని వీరందరికీ ప్రోత్సాహంగా అందించడం శ్రీనివాస్ నిస్వార్ధతను తెలియజేస్తోందని పురాణపండ శ్రీనివాస్ ను ఆశీర్వదించారు.
గోదావరి జిల్లాలనుండి ప్రత్యేకంగా ఈ మహత్కార్యానికి హాజరైన పురాణపండ శ్రీనివాస్ కి ఈ కాలనీ ఉపాధ్యక్షులు రవి ప్రసాద్, శ్రీమతి శారద దంపతులు గురుచరిత్ర గ్రంధాలను అమోఘ సాధనంగా అందజేశారు.
ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ జ్ఞానమహాయజ్ఞకేంద్రం సంస్థాపక కార్యదర్శి పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలన వైభవం ‘ శ్రీ మాలిక ‘ , నన్నేలు నాస్వామి మహా దివ్య గ్రంధాలను ఈ సందర్భంగా భక్త బృందాలకు ఉచితంగా అందజేశారు.
రమణీయ గుణాలతో భక్త పాఠకుల హృదయాలను పులకితం చేస్తున్న పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనాలు ఇప్పటికే తెలుగునాట మాత్రమే కాకుండా దేశ దేశాల తెలుగువారినీ గత రెండు దశాబ్దాలుగా విశేషంగా ఆకట్టుకుంటున్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని విమర్శకులు, రసజ్ఞులు స్ఫష్టం చేస్తున్నారు.
గణపతి నవరాత్రుల ప్రారంభ సంరంభం నుండీ మణికొండ నుండి నార్సింగ్ వెళ్లే దారిలో ఉన్న ఈ అభయగణపతి దేవాలయ వాసులు గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న ఉత్సవాలు ఎంతో ఎంతో పరమ పవిత్రంగా సంచలనం సృష్టిస్తున్నాయి. నిత్యార్చన, ప్రత్యేక అర్చన, కుంకుమార్చన , అభిషేకార్చన, సహస్ర మోదక పరిమళ హోమం వంటి అమోఘ కార్యాలతో కాళోజీకి క్రొత్త శోభ తేవడం ఆయా ప్రాంతాలవారు ప్రత్యేకంగా చెప్పుకోవడం కనిపిస్తోంది.
ఈ ఉత్సవ నిర్వహణలో కాలనీ కార్యదర్శి రమేష్ ప్రత్యేక శ్రద్ధ చూపడం విశేషం.
అధ్యక్షులు భాస్కర రెడ్డి, పాలక వర్గమైన సంజయ్ కుమార్, రవి ప్రసాద్ , రవి వర్మ వంటి ప్రముఖులెందరో ఎంతో ఉత్సాహం చూపడం కాలనీ వాసుల ఐకమత్యాన్ని ఆవిష్కరించింది . ఇవన్నీ ఒక ఎత్తైతే ఏ స్వార్ధం లేకుండా అందరినీ ఈ మహోదాత్త కార్యానికి ఎంతో సంతోషంతో ప్రోత్సహించిన గోదావరి జిల్లాలకు చెందిన ప్రఖ్యాత రచయిత పురాణపండ శ్రీనివాస్ కి అంతా ధన్యవాదాలు తెలిపారు.



