Sagar Canal breach : సాగర్ కాలువకు గండి
- మాచర్ల..కారంచేడు మధ్య ఘటన
- 20 గ్రామాల్లో ఆందోళన
( ఆంధ్రప్రభ, పల్నాడు ప్రతినిధి)
బాపట్ల జిల్లా కారంచేడు (karamchedu) -మాచర్ల (Macharla) మధ్య నాగార్జున సాగర్ కుడి (Sgar Right cnal bank) కాలువ గట్టుకు గండి పడింది. కారంపూడి ఎస్కేప్ ఛానల్ వద్ద ( escape channel Breach ) గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గండి పడటంతో 20 గ్రామాల జనం (20 villages People) కంగారెత్తిపోయారు.
ఈ కాలువకు గండితో నాగులేటి వాగులో నీరు పరవళ్లు తొక్కతోంది. ఈ వాగు దిగువ ప్రాంతాల ప్రజలు హుటాహుటిన గండి ప్రాంతానికి చేరుకున్నారు. ముంపు ముప్పు నుంచి తమ గ్రామాలను కాపాడుకునేందుకు శుక్రవారం ఉదయం నుంచి ఈ గండిని పూడ్చుతున్నారు. వీరుల తిరునాళ్లలో దుకాణాల్లోకి నీరు చేరింది. ఈ సమాచారంతో అధికారులు (Officials) గండి ప్రాంతానికి చేరుకున్నారు .
కుడికాలువలో నీటిని నిలుపదల చేయాలని ప్రాజెక్టు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ కుడికాలువకు గండి పడడం ఇదే మొదటి సారి కాదు. ఎగువ ప్రాంతాల్లోని రైతులు నీళ్ల కోసం చిన్న చిన్న గండ్లు పెట్టడం మామూలేనని, అయితే ఈసారి భారీగా గండిపడి నాగులేటి వాగు (naguleti vagu) లోకి నీరు చేరుతోంది.

