ఉట్నూర్ నూతన ఎస్పీగా రుత్విక్ సాయి కొట్టే

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ నూతనఏ ఎస్పీగా రిత్విక్ సాయి కొట్టే ఐపీఎస్ ను రాష్ట్ర డిజిపి పి శివధర్ రెడ్డి నియమస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన గురువారం అదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహజన్ కు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి బాధ్యతలను స్వీకరించారు. ఎస్పీ అఖిల్ మహజన్ తో సమావేశం అయ్యారు.
ఉట్నూర్ నూతన ఏ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రిత్విక్ సాయి కొట్టే, ఎస్పీ ఈ సందర్భంగా ఇరువురు అధికారులు ఉట్నూర్ సబ్ డివిజనల్ పై పూర్తిగా చర్చించారు. ప్రస్తుతం పరిస్థితులు, శాంతిభద్రతల రక్షణ, చర్యలు వాటిపై జిల్లా ఎస్పీ వివరించారు. 2023 బ్యాచ్కు చెందిన ఈ ఐపీఎస్ అధికారి గతంలో వేములవాడ ఎఎస్పీ గా బాధ్యతలను నిర్వహించి, ఉట్నూర్ కు బదిలీ అవ్వడం జరిగిందని పోలీస్ అధికారులు తెలిపారు.
