Rural Police | అలాంటి చర్యలకు పాల్పడితే..

Rural Police | అలాంటి చర్యలకు పాల్పడితే..
Rural Police | ఉయ్యూరు, ఆంధ్రప్రభ : కోడిపందాల పై ఉయ్యూరు రూరల్ పోలీసులు(Rural Police) కొరడా ఝుళిపించారు. కాటూరులోని కలవపాముల వెళ్లే రోడ్డులో కోడిపందాలకు సిద్ధం చేస్తున్న బర్రులను ఉయ్యూరు రూరల్ పోలీసులు, స్థానిక రెవెన్యూ అధికారుల సహకారంతో ధ్వంసం చేశారు.
తమ పరిధిలో ఎటువంటి అసాంఘిక(anti-social) కార్యకలాపాలకు తావులేదని, ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే తమకు కాల్ చేస్తే వెంటనే స్పందిస్తామని ఉయ్యూరు రూరల్ ఎస్సై సురేష్ అన్నారు.
