Rupee-Ruble | పుతిన్‌తో భారత్ చర్చల అనంతరం డాలర్ అవసరం తగ్గనుందా?
Rupee-Ruble | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : విశిష్ట అతిథి విచ్చేశారు… భారత ప్రధాని విందు ఇచ్చారు. చర్చలు జరుగుతున్నాయి. ఇక వాటి ఫలితాలు, ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయనేదానిపైనే ప్రస్తుతం భారతీయులందరూ(All Indians) ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Rupee-Ruble | ముఖ్యంగా క్షీణిస్తున్న రూపాయి, డాలర్ ఆధిపత్యం..
ఈ విషయంపై ఇరుదేశాధినేతలు సీరియస్ గానే ఉన్నారు. పుతిన్‌తో భారత్ చర్చలు ముఖ్యంగా రూపాయి-రూబుల్(Rupee-Ruble) వాణిజ్యం, ఇతర స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం ప్రధాన ఉద్దేశాలలో ఒకటి డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడం.
డాలర్ అవసరం తగ్గుతుందా అనేది పూర్తిగా జరగకపోవచ్చు. కానీ, భారత్-రష్యా(India-Russia) మధ్య ద్వైపాక్షిక వాణిజ్యానికి రూపాయి-రూబుల్ (లేదా ఇతర స్థానిక కరెన్సీల) చెల్లింపుల వ్యవస్థను అమలు చేయడం వల్ల పరిమిత స్థాయిలో డాలర్ అవసరం తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందంటే.. రష్యా నుండి మనం దిగుమతి చేసుకునే చమురు, రక్షణ ఉత్పత్తుల బిల్లును డాలర్లలో చెల్లించకుండా, రూపాయలలో లేదా రూబుల్స్‌లో చెల్లించగలిగితే ఆ మేరకు డాలర్ డిమాండ్(Dollar Demand) తగ్గుతుంది. చమురు కొనుగోళ్లపై భారీ ఆదా అవుతుంది.

చౌకగా దొరకడం వల్ల ప్రస్తుతం భారతదేశం రష్యా నుంచి భారీగా చమురును దిగుమతి(Oil import) చేసుకుంటోంది. ఈ కొనుగోళ్లకు డాలర్లు చెల్లించకపోవడం వలన దేశం నుండి డాలర్ల ప్రవాహం తగ్గుతుంది. ఇక వాణిజ్య లోటు సమస్య విషయానికొస్తే భారత్ రష్యా నుండి దిగుమతులు భారీగా ఉన్నాయి కానీ రష్యాకు మన ఎగుమతులు చాలా తక్కువగా ఉన్నాయి.

ఈ వాణిజ్య లోటు కారణంగా రష్యాకు చెల్లించడానికి మన వద్ద పెద్ద మొత్తంలో రూపాయిలు మిగిలిపోతాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఈ మిగిలిన రూపాయలను రష్యా ఉపయోగించుకునేందుకు వీలుగా భారత్ నుంచి దిగుమతులను రష్యా దిగుమతులు పెంచితేనే డాలర్ అవసరం మరింత తగ్గుతుంది.
Rupee-Ruble | రూపాయి విలువ పడిపోవడం ఆగుతుందా
మరి దీనివల్ల రూపాయి విలువ పడిపోవడం ఆగుతుందా అంటే భారత్-రష్యా ఒప్పందం వల్ల రూపాయి పతనం ఆగదు కానీ దానిపై ఒత్తిడి తగ్గే అవకాశాలుంటాయి. డాలర్ డిమాండ్ పాక్షికంగా తగ్గుతుంది. రష్యాకు చెల్లించాల్సిన చమురు, రక్షణ బిల్లుకు డాలర్లు వాడక పోవడం(Disuse) రూపాయిపై ఒత్తిడిని కొంత మేర తగ్గిస్తుంది.
ఎందుకంటే ప్రధాన కారణాలు అమెరికన్(American) డాలర్ బలం, పెట్టుబడుల ఉపసంహరణ, ఇతర దేశాలతో ఉన్న మొత్తం వాణిజ్య లోటు. ఈ కారణాలను కేవలం రష్యాతో వాణిజ్యం ద్వారా రూపాయి పతనం సమస్య పూర్తిగా పరిష్కరించలేం. రూపాయి విలువ పతనం ఆగిపోవాలంటే, అమెరికన్ వడ్డీ(American interest) రేట్లు, అంతర్జాతీయ చమురు ధరలు, భారతీయ ఎగుమతుల పనితీరు వంటి పెద్ద ఆర్థిక అంశాలు మెరుగుపడాలి.

