RTC traveling | ప్రజల భద్రతే లక్ష్యంగా..

RTC traveling | ప్రజల భద్రతే లక్ష్యంగా..

  • స్టాప్‌.. వాష్‌ అండ్ గో త‌నిఖీలు
  • ఎస్పీ సునీల్ షొరాణ్

RTC traveling | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జాతీయ రహదారిపై ఇటీవల కాలంలో జరుగుతున్నరోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాత్రి సమయాల్లో తెల్లవారుజామున వాహనాలలో వెళ్లే డ్రైవర్లకు(drivers) నిబంధనలు జారీ చేశారు.

జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఎన్‌హెచ్ 44పై నంద్యాల పోలీసులు “స్టాప్‌ – వాష్‌ అండ్ గో(stop – wash and go)” కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ ట్రావెలింగ్(RTC traveling) బస్సులలో సరైన భద్రతా చర్యలు, జాగ్రత్తలు పాటించాలని ఈ రోజు తెల్లవారుజామున తనిఖీలు నిర్వ‌హించారు.

Leave a Reply