ADB |గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

జన్నారం, ఏప్రిల్ 10 (ఆంధ్రప్రభ): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని మొర్రిగూడ వాసి, ఉట్నూర్ టీఎస్ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్న భుక్య రమేష్(44) గుండెపోటుతో ఇవాళ‌ ఉదయం 9.30 గంటలకు చనిపోయాడు. మృతుడు గత 5 సంవత్సరాలుగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ టి.ఎస్.ఆర్.టి.సి డిపోలో బస్ కండక్టర్ గా పనిచేస్తున్నారు. నిన్న డ్యూటీ చేసి ఇంటికి వచ్చి రాత్రి పడుకొని తెల్లవారుజామున జాతిలో నొప్పి వస్తుందని భార్యకు తెలియజేయగా, ఆమె వెంటనే మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ఆ వైద్యుడు తెలిపారు.

మృతునికి భార్య అంజలి, 22 ఏళ్ల కుమారుడు రఘువీర్, 20ఏళ్ల కూతురు సోని ఉన్నారు. సంవత్సర క్రితం కూతురు వివాహం అయింది. కుమారుడు రఘువీర్ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గత 6 సంవత్సరాల క్రితం తండ్రి కిమ్యానాయక్ ఇదే డిపోలో పనిచేస్తూ డ్యూటీలో భాగంగా బస్సులోనే గుండెపోటుకు గురై చనిపోయాడు. తల్లి కూడా చనిపోయింది. రమేష్ అందరితో నోట్లో నాలుకలాగ మెలిగేవాడని, ఆయన మృతి పట్ల పలువురు విచారం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *