సర్వీస్ రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్సు రావాలి

సర్వీస్ రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్సు రావాలి

సదాశివనగర్, ఆంధ్రప్రభ : మండలంలోని దగ్గి గ్రామం వద్ద సర్వీస్ రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్సు(RTC bus) నడపాలని తిమ్మాజివాడి మాజీ ఉపసర్పంచ్ చాకలి రాజయ్యతో పాటు వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 44వ జాతీయ రహాదారి నిజామాబాద్ వైపు నుండి వచ్చే ఆర్టీసీ బస్సులు సర్వీస్ రోడ్డు మీదుగా రాకపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు.

నిజామాబాద్(Nizamabad) వైపు నుండి వచ్చే ఆర్టీసీ బస్సు 44వ జాతీయ రహదారి పైన ఆపి ప్రయాణికులను అక్కడే దించి వెళ్తున్నారు. దీంతో జాతీయ రహాదారి నుండే ప్రయాణికులు దాటి వెళ్తున్నారు. గతంలో కూడా అక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం కూడా జరిగింది. సర్వీస్ రోడ్డు(Service Road) మీదుగా ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో బస్ షెల్టర్లు నిరుపయోగంగా మారాయి.

దగ్గి గ్రామంతో పాటు తిమ్మాజి వాడి, తుక్కోజి వాడి, వజ్జపల్లి, ఉత్తునూర్, వజపల్లి తండా, యాచారం, యాచారం(Yacharam) పరిధిలోని తండాల ప్రజలు ఇక్కడి నుండే ప్రయాణిస్తుంటారు. ఆర్టీసీ అధికారులు స్పందించి సర్వీస్ రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్సులను నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply