RTC bus | పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

- తప్పిన ప్రమాదం…
- ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
RTC bus | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మల్లేపల్లి – కొల్లూర్(Mallepally – Kollur) గ్రామాల సరిహద్దులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ పొలాల్లోకి తీసుకువెళ్లిన ఘటన ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది.
ఈ సంఘటనకు సంబంధించి ప్రయాణికుల కథనం ప్రకారం… మక్తల్ నుండి నారాయణపేట వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు(RTC bus)లో వెళుతుండగా మల్లెపల్లి, కొల్లూర్ గ్రామాల మధ్యలో నారాయణపేట మక్తల్ ఆర్ అండ్ బీ రహదారిపై బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు పొలాల్లోకి దూసుకెళ్లి ఒక దగ్గర నిలువగా ప్రయాణికులంతా బస్సు దిగి పరుగులు పెట్టారు.

